Credit Score: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలలో సిబిల్ స్కోర్.. చెక్ చేసుకోండిలా
ABN , Publish Date - Mar 10 , 2024 | 05:29 PM
క్రెడిట్ కార్డు వాడే వారు క్రెడిట్ స్కోర్(Credit Score) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి బ్యాంక్ యాప్‌లు రూ.500 - 1000 వరకు రుసుములు వసూలు చేసేవి.
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు వాడే వారు క్రెడిట్ స్కోర్(Credit Score) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి బ్యాంక్ యాప్‌లు రూ.500 - 1000 వరకు రుసుములు వసూలు చేసేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి యూపీఐ యాప్‌లు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలలో మీ క్రెడిట్ స్కోర్ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి.
పేటీఎంలో..
స్మార్ట్‌ఫోన్‌లో Paytm యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
Paytm యాప్‌లో లాగిన్ చేయండి లేదా సైన్ అప్ చేయండి.
'లోన్‌లు & క్రెడిట్ కార్డ్‌లు' ఆప్షన్ కింద 'ఉచిత క్రెడిట్ స్కోర్' ఎంపికకు నావిగేట్ చేయండి.
నిబంధనలు, షరతులకు అంగీకరించి.. మీ క్రెడిట్ స్కోర్‌ని ఈజీగా తెలుసుకోండి.
గూగుల్ పేలో..
Google Payని ఇన్‌స్టాల్ చేయండి.
లాగిన్ చేయండి లేదా కొత్త ఖాతాను సృష్టించండి.
మీ CIBIL స్కోర్‌ను చెక్ చేయండి
ఫోన్ పేలో..
Phone Pe యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
లాగిన్ చేయండి లేదా నమోదు చేయండి.
'క్రెడిట్' విభాగంలో CIBIL స్కోర్‌ను చూడటానికి 'Check Now' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి