Share News

ఐసీఐసీఐ ప్రు బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌

ABN , Publish Date - May 06 , 2024 | 06:03 AM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. 2021 జనవరిలో ప్రారంభించిన ఐసీఐసీఐ ప్రు బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులు అందిస్తోంది. ఏకమొత్తంగా లేదా క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) రూపంలో...

ఐసీఐసీఐ ప్రు బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. 2021 జనవరిలో ప్రారంభించిన ఐసీఐసీఐ ప్రు బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులు అందిస్తోంది. ఏకమొత్తంగా లేదా క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) రూపంలో పెట్టిన పెట్టుబడులకు మెరుగైన రిటర్నులను అందించింది. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌గా ఉంది. ఈ ఫండ్‌ ప్రారంభమైన 2021 జనవరి 18న ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఉంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ మొత్తం రూ.20.8 లక్షలకు చేరుకుంది. అంటే ఏటా 25.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో నిఫ్టీ 100 టీఆర్‌ఐ రిటర్నులు ఏటా 19.7 శాతం వృద్ధితో రూ.17.7 లక్షలకు చేరుకుంది. ఇక సిప్‌ రూపంలో ప్రతి నెల రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి (మొత్తం రూ.3.9 లక్షలు) ఉంటే 2024 మార్చి నాటికి ఆ మొత్తం రూ.6.1 లక్షల కోట్లకు చేరింది. ఈ ఫండ్‌ ప్రధానంగా అంతర్జాతీయంగా మెటల్స్‌, మైనింగ్‌, ఆయిల్‌ రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయగా దేశీయంగా కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకింగ్‌, ఆటో, ఇన్‌ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.

Updated Date - May 06 , 2024 | 06:17 AM