ఐసీఐసీఐ ప్రు ఈక్విటీ మినిమమ్ వేరియన్స్ ఫండ్
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:36 AM
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. ఈక్విటీ మినిమమ్ వేరియన్స్ ఫండ్‌ను ప్రారంభించింది. తక్కువ ఆటుపోట్లతో కూడిన పోర్టుఫోలియోను రూపొందించటమే ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ప్రధాన లక్ష్యం...
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. ఈక్విటీ మినిమమ్ వేరియన్స్ ఫండ్‌ను ప్రారంభించింది. తక్కువ ఆటుపోట్లతో కూడిన పోర్టుఫోలియోను రూపొందించటమే ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ప్రధాన లక్ష్యం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో ఇన్నోవేటివ్ విధానంతో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్నులు అందించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వెల్లడించింది. నిఫ్టీ 50 టీఆర్‌ఐ ఈ ఫండ్‌కు బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈక్విటీ మినిమమ్ వేరియన్స్ ఫండ్ ప్రధానంగా తక్కువ ఆటుపోట్లు ఉన్న లార్జ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. సిప్ రూపంలో కనీస పెట్టుబడి రూ.100. ఈ ఫండ్ ముగింపు తేదీ డిసెంబరు 2.