కాకినాడలో నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ ప్రారంభం
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:09 AM
కోరమాండల్ ఇంటర్నేషనల్ నానో ఎరువుల విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కోరమాండల్ ఇంటర్నేషనల్ నానో ఎరువుల విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆదివారం నాడు ఈ ప్లాంట్‌ను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకరసుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో కంపెనీ కొత్తతరం ఎరువుల విభాగంలోకి ప్రవేశించిందని సుబ్రమణియన్ అన్నారు. ఏటా కోటి సీసాల నానో ఎరువుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కాకినాడ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఈ ఎరువులను గ్రోమోర్ నానో డీఏపీ, గ్రోమోర్ నానో యూరియా పేర్లతో మార్కెట్ చేయనుంది.