Indian Economy: మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్: ఫైనాన్స్ మినిస్ట్రీ
ABN , Publish Date - Jan 29 , 2024 | 06:46 PM
రానున్న మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందనుందని, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఫైనాన్స్ మినిస్ట్రీ అంచనా వేసింది. ఇక 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పదేళ్లక్రితం 1.9 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో భారత్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కరోనా వంటి పెను సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుతం 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ గుర్తుచేసింది.
న్యూఢిల్లీ: రానున్న మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందనుందని, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఫైనాన్స్ మినిస్ట్రీ అంచనా వేసింది. ఇక 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పదేళ్లక్రితం 1.9 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో భారత్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కరోనా వంటి పెను సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుతం 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ గుర్తుచేసింది.
ఈ పదేళ్లలో అనేక సంస్కరణలు జరిగాయని, అవి దేశ ఆర్థిక పురోగతికి గణనీయంగా దోహదపడ్డాయని ఫైనాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్ పేర్కొంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలనే ఉన్నత లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని, ఇందుకు వివిధ స్థాయిలలో ఫలవంతమైన సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ భాగస్వామ్యం అవసరమని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. సంస్కరణలు కొనసాగినప్పుడు మాత్రమే లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవల సంవత్సరాలలో గణనీయ వృద్ధిని సాధించడానికి డిమాండ్ ప్రధాన కారణంగా ఉందని, 7 శాతానికి దగ్గరగా వృద్ధి రేటు నమోదవడానికి దోహదపడుతోందని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. 2030 నాటికి 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధించేందుకు దేశీయ డిమాండ్ దోహదపడనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.