Share News

ఐపీఓకి ఇండిక్యూబ్‌ స్పేసెస్‌

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:23 AM

వర్క్‌ప్లేస్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఇండిక్యూబ్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది....

ఐపీఓకి ఇండిక్యూబ్‌ స్పేసెస్‌

రూ.850 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: వర్క్‌ప్లేస్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఇండిక్యూబ్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ కొత్త ఈక్విటీ షేర్ల జారీతో రూ.750 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా మరో రూ.100 కోట్లను సమీకరించనుంది. ఓఎ్‌ఫఎస్‌ ద్వారా ప్రమోటర్లు రిషి దాస్‌, మేఘనా అగర్వాల్‌ రూ.100 కోట్లకు సమానమైన వాటాలను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించనున్న మొత్తాల్లో రూ.462.60 కోట్లను కొత్త సెంటర్ల ఏర్పాటుతో పాటు మూలధన వ్యయాల కోసం ఉపయోగించనుంది. మరో రూ.100 కోట్లను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది. 2015లో కార్యకలాపాలు ప్రారంభించిన ఇండిక్యూబ్‌ దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 103 సెంటర్లను నిర్వహిస్తోంది.

Updated Date - Dec 26 , 2024 | 05:23 AM