కీలక రంగాలు డీలా
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:40 AM
పారిశ్రామికోత్పత్తికి కీలకమైన 8 రంగా ల ఉత్పత్తి వృద్ధిరేటు ఈ అక్టోబరులో 3.1 శాతానికి పడిపోయింది.
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తికి కీలకమైన 8 రంగా ల ఉత్పత్తి వృద్ధిరేటు ఈ అక్టోబరులో 3.1 శాతానికి పడిపోయింది. గత ఏడాదిలో ఇదే నెలలో నమోదైన 12.7 శాతం ఉత్పత్తి వృద్ధితో పోలిస్తే బాగా తగ్గింది. సెప్టెంబరులో నమోదైన 2.4 శాతం వృద్ధితో పోలిస్తే మాత్రం కాస్త మెరుగైంది. బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలను కీలకంగా భావిస్తారు. దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ 8 రంగాలు 40.27 శాతం వెయిటేజీ కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలలకు (ఏప్రిల్-అక్టోబరు) కీలక రంగాల ఉత్పత్తిలో 4.1 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి వృద్ధి 8.8 శాతంగా ఉంది.