Infinix Hot 50 5G: తక్కువ బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకుంటున్నారా..
ABN , Publish Date - Sep 05 , 2024 | 06:40 PM
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఇన్ఫినిక్స్’ భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ (Infinix Hot 50 5G) పేరిట హాట్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఇన్ఫినిక్స్’ భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ (Infinix Hot 50 5G) పేరిట హాట్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 48 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.7-అంగుళాల డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు మరిన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ ధరతో పాటు ఇతర వివరాలను తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. డ్రీమీ పర్పుల్, సేజ్ గ్రీన్, స్లీక్ బ్లాక్, వైబ్రాంట్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇక 4జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది. 4జీబీ వేరియెంట్ ధర రూ.9,999గా, 8జీబీ వేరియెంట్ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై ఈ ఫోన్ విక్రయాలు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ధర ఇంకా తగ్గాలంటే కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ.1000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
ఫోన్ ఫీచర్లు ఇవే..
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫీచర్ల విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. కెమెరా విషయానికొస్తే స్మార్ట్‌ఫోన్ డెప్త్ సెన్సార్‌తో బ్యాక్ కెమెరా 48 ఎంపీ, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందించింది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ, 3జీ, 2జీ, బ్లూటూత్ వీ5.4, వై-ఫై 5 ఉన్నాయి. సెన్సార్ల పరంగా జీ-సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్ (సాఫ్ట్‌వేర్), లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, సైడ్ మౌంటెడ్ అందించింది. ఇక ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కంపెనీ అందించింది. ఇక ఈ ఫోన్ బరువు 188 గ్రాములుగా ఉంది.