Share News

Inflation Rate : ధరల హోరు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:05 AM

దేశంలో ధరలు హోరెత్తిపోతున్నాయి. ఆహార వస్తువులు ప్రత్యేకించి కూరగా యల ధరలు ప్రియం అయిన కారణంగా జూన్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి. మే నెలలో ఇది 4.8 శాతం ఉండగా గత ఏడాది జూన్‌లో 4.87 శాతం ఉంది.

Inflation Rate : ధరల హోరు..

జూన్‌ ద్రవ్యోల్బణం 5.08 శాతం

న్యూఢిల్లీ: దేశంలో ధరలు హోరెత్తిపోతున్నాయి. ఆహార వస్తువులు ప్రత్యేకించి కూరగా యల ధరలు ప్రియం అయిన కారణంగా జూన్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి. మే నెలలో ఇది 4.8 శాతం ఉండగా గత ఏడాది జూన్‌లో 4.87 శాతం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి తగ్గుముఖంలో ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌లో తిరిగి పైకి ఎగసింది. ఆహార వస్తువుల ధరలు జూన్‌ నెలలో 9.36 శాతం మేరకు పెరిగాయి. వడ్డీరేట్లపై నిర్ణయం కోసం ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్నే గీటురాయిగా తీసుకుంటుంది.

ఏడు నెలల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

పారిశ్రామిక రంగం మే నెలలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 7 నెలల గరిష్ఠ స్థాయి 5.9 శాతంగా నమోదయింది. ప్రధానంగా పవర్‌, మైనింగ్‌ రంగాలు ఇందుకు దోహదపడ్డాయి. గత ఏడాది అక్టోబరులో నమోదైన గరిష్ఠ వృద్ధి 11.9 శాతం తర్వాత నమోదైన గరిష్ఠ వృద్ధి ఇదే. కాగా ఏప్రిల్‌లో ఇది 5 శాతం ఉండగా గత ఏడాది మేలో 5.7 శాతం ఉంది. ఈ మే నెలలో మైనింగ్‌ రంగం 6.6 శాతం, విద్యుత్‌ రంగం 13.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. తయారీ రంగం వృద్ధి మాత్రం 4.6 శాతానికి దిగజారింది.

Updated Date - Jul 13 , 2024 | 05:05 AM