Share News

ఐఎ్‌సబీ ఎంబీఏ కోర్సుకు అంతర్జాతీయ ర్యాంక్‌

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:33 AM

ప్రపంచంలోని టాప్‌ 100 ఎంబీఏ కోర్సు ల్లో మూడు ఐఐఎంల నిర్వహణలోని కోర్సులు, ఇండి యన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) నిర్వహణలోని ఎంబీఏ కోర్సు ఉన్నాయి. లండన్‌కు చెందిన ఉన్నత విద్య విశ్లేషణ సంస్థ క్వాక్‌క్వారెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) ఈ ర్యాంకింగ్‌లు...

ఐఎ్‌సబీ ఎంబీఏ కోర్సుకు అంతర్జాతీయ ర్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్‌ 100 ఎంబీఏ కోర్సు ల్లో మూడు ఐఐఎంల నిర్వహణలోని కోర్సులు, ఇండి యన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) నిర్వహణలోని ఎంబీఏ కోర్సు ఉన్నాయి. లండన్‌కు చెందిన ఉన్నత విద్య విశ్లేషణ సంస్థ క్వాక్‌క్వారెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) ఈ ర్యాంకింగ్‌లు ప్రకటించింది. ఇక ఆ జాబితాలోని మూడు ఐఐఎంలలో బెంగళూరు, అహ్మదాబాద్‌, కలకత్తా ఐఐఎం ఉన్నాయి. ఉపాధికి అర్హమైన టాప్‌ 50 సంస్థల్లో మూడు బిజినెస్‌ స్కూళ్లున్నాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ వరుసగా ఐదో ఏడాదిలోనూ ప్రపంచ టాప్‌ 1 ర్యాంకింగ్‌లో నిలిచిం ది. 58 దేశాలకు చెందిన 340 ఉత్తమ ఎంబీఏ కోర్సులు ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో పరిశీలనకు వచ్చాయి. ఆ యా విభాగాల్లో ఉత్తమ కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి ఈ ర్యాంకింగ్స్‌ సహాయపడతాయి.

Updated Date - Sep 26 , 2024 | 12:33 AM