Investment Tips: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్లు పడుతుంది?
ABN , Publish Date - Sep 01 , 2024 | 03:34 PM
ధనవంతులుగా మారడం అంత అసాధ్యమైన పని మాత్రం కాదు. దీని కోసం మీరు తెలివిగా పెట్టుబడి చేస్తే చాలు. ఆ తర్వాత మీ డబ్బు మీమ్మల్ని ధనవంతులు కావడానికి మార్గం సులభం చేస్తుంది. అయితే నెలకు రూ.10 వేలు పెట్టుబడి చేస్తే కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకుంటారు. ధనవంతులుగా మారడం అంత అసాధ్యమైన పని మాత్రం కాదు. దీని కోసం మీరు తెలివిగా పెట్టుబడి చేస్తే చాలు. ఆ తర్వాత మీ డబ్బు మీమ్మల్ని ధనవంతులు కావడానికి మార్గం సులభం చేస్తుంది. కొద్దికొద్దిగా ఇన్వెస్ట్(investment) చేయడం ద్వారా తక్కువ సమయంలోనే కోటీశ్వరులుగా మారవచ్చు. అయితే అందుకోసం ఎన్నేళ్ల సమయం పడుతుంది, ఎంత పెట్టుబడి చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
SIPలో పెట్టుబడి
తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఎవరైనా ధనవంతులు కావచ్చు. సంపదను సృష్టించడానికి క్రమశిక్షణ, సహనంతో సరైన వాటిలో పెట్టుబడి చేయాలి. వాటిలో ఒకటి SIP. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. SIP ద్వారా షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు రుణం లేదా బంగారం వంటి వస్తువులలో కూడా SIP చేయవచ్చు. వివిధ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు వివిధ రకాల SIP ఎంపికలను అందిస్తున్నాయి. మీరు వాటిలో మీకు ఇష్టమైన దానిని ఎంచుకోవచ్చు. మీ రిస్క్, రాబడిని బట్టి SIPలు ఉంటాయి.
ఎంత సమయం
SIPపై రాబడి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు. మీ పెట్టుబడిపై నామమాత్రపు రాబడిని పొందడం కూడా ఉంటుంది. దీనిలో సగటు రాబడి 12 నుంచి 17 శాతం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మీరు నెలవారీ సిప్ పెట్టుబడి రూ. 10 వేలను 20 ఏళ్లు పెట్టుబడి చేస్తే చేసే మీరు పెట్టేది మొత్తం రూ.24 లక్షలు అవుతుంది. ఆ క్రమంలో 20 ఏళ్ల తర్వాత 15 శాతం వడ్డీ చొప్పును మీకు వచ్చేది మొత్తం రూ.1,51,59,550.
మీరు పెట్టుబడి చేసిన 24 లక్షలకు రూ. 1,27,59,550 వడ్డీ కూడా యాడ్ అవుతుంది. ఈ క్రమంలో 20 ఏళ్లలో మీరు మంచి రాబడులను పొందవచ్చు. ఒకవేళ మీరు నెలకు రూ.15 వేలు పెట్టుబడి చేస్తే మీరు 15 ఏళ్లలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు
వచ్చిన మొత్తాన్ని మీరు రిటైర్‌మెంట్ ఫండ్‌గా ఉపయోగించుకోవచ్చు. లేదా ఇల్లు లేదా కారు కొనాలనే ప్లాన్ ఉంటే అది కూడా సాధ్యమే. లేదంటే మీ పిల్లల పెళ్లిళ్లు లేదా ఇతర ఖర్చుల కోసం వాడుకోవచ్చు. లేదా ఆ మొత్తాన్ని బ్యాంకులో FD చేసినా మీరు వడ్డీ రూపంలో నెలకు కొంత మొత్తాన్ని పొందవచ్చు. SIPలో ఈ అద్భుతమైన రాబడి సమ్మేళనం ద్వారా వస్తుంది. సమ్మేళనం అంటే చక్రవడ్డీ. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెట్టిన మొత్తం క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. రాబడులు దానికి యాడ్ అవుతూ ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..
Google Pay: గూగుల్ పే నుంచి కొత్తగా ఆరు ఫీచర్లు.. అవేంటంటే..
Read More Business News and Latest Telugu News