ఏలియన్స్ డెవలపర్స్ ప్రాజెక్టుల్లో రూ.145 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Apr 05 , 2024 | 02:17 AM
హైదరాబాద్ రియల్టీ రంగం ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలనూ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లో ఏలియన్స్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న రెండు రియల్టీ ప్రాజెక్టుల్లో నిసస్ ఫైనాన్స్ రూ.145 కోట్లు పెట్టుబడి పెట్టింది...
నిసస్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ రంగం ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలనూ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లో ఏలియన్స్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న రెండు రియల్టీ ప్రాజెక్టుల్లో నిసస్ ఫైనాన్స్ రూ.145 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇందులో ఒకటి 272 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఏలియన్స్ హబ్ ప్రాజెక్టు. మరొకటి 15 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఏలియన్స్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు అని నిసెస్ ఫైనాన్స్ తెలిపింది. తమ కంపెనీకి చెందిన రియల్ ఎస్టేట్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్-1 (రెసో-1) ద్వారా ఈ పెట్టుబడి పెట్టినట్టు నిసస్ పేర్కొంది.