ఈవీలపై సుంకాలు పెంచితే కష్టమే
ABN , Publish Date - Dec 20 , 2024 | 02:44 AM
విద్యుత్ వాహనాలపై సుంకాలు పెంచితే విద్యుదీకరణ ప్రయాణానికి అవరోధం ఏర్పడుతుందని కియా ఇండియా సీఈఓ గ్వాంగ్ లీ అన్నారు. కొత్త ఎస్‌యూవీ సిరో్‌సను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ...
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలపై సుంకాలు పెంచితే విద్యుదీకరణ ప్రయాణానికి అవరోధం ఏర్పడుతుందని కియా ఇండియా సీఈఓ గ్వాంగ్ లీ అన్నారు. కొత్త ఎస్‌యూవీ సిరో్‌సను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఈవీల ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఎలాంటి పన్ను ప్రోత్సాహకం లేకపోతే మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయన ఆవేదన ప్రకటించారు. ప్రస్తుతం దేశీయ విపణిలో రెండు ఈవీ మోడళ్లు విక్రయిస్తోంది. ఈవీ 6 ప్రారంభ ధర రూ.60.96 లక్షలు. అలాగే ఈవీ 9 ప్రారంభ ధర రూ.1.3 కోట్లుంది.