ప్రత్యేక కంపెనీగా ఐటీసీ హోటల్స్
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:30 AM
ఐటీసీ హోటల్స్ పేరుతో హోటళ్ల వ్యాపారాన్ని విభజించేందుకు అన్ని షరతులను పూర్తి చేసినట్లు ఐటీసీ గ్రూప్ మంగళవారం వెల్లడించింది. ఈ విభజన 2025 జనవరి 1 నుంచి...
జనవరి 1 నుంచి అమలు
ఐటీసీ హోటల్స్ పేరుతో హోటళ్ల వ్యాపారాన్ని విభజించేందుకు అన్ని షరతులను పూర్తి చేసినట్లు ఐటీసీ గ్రూప్ మంగళవారం వెల్లడించింది. ఈ విభజన 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా, ఐటీసీ హోటల్స్.. 60 శాతం ఈక్విటీ వాటా షేర్లను ఐటీసీ వాటాదారులకు కంపెనీలో వారి షేర్‌హోల్డింగ్ ఆధారంగా కేటాయించనుంది. కంపెనీలోని మిగతా 40 శాతం వాటాను ఐటీసీ కలిగి ఉండనుంది. ఐటీసీ హోటల్స్ దేశంలోని 90కి పైగా ప్రాంతాల్లో 140కి పైగా హోటళ్లను నిర్వహిస్తోంది.