స్విగ్గీ ఉద్యోగులకు జాక్‌పాట్
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:07 AM
ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఐపీఓ కంటే ఎంతో ముందే తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈ-సాప్స్) కింద...
ఒక్కో ఉద్యోగికి రూ.1.8 కోట్ల ఈ-సాప్స్
ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఐపీఓ కంటే ఎంతో ముందే తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈ-సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. బుధవారం స్విగ్గీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టు కానున్నాయి. ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ.390 వద్ద లిస్టయినా ఒక్కో ఉద్యోగి వద్ద ఉన్న షేర్ల సగటు విలువ రూ.1.8 కోట్లకు చేరుతుందని (మొత్తం విలువ రూ..9,000 కోట్లు) మార్కెట్ వర్గాల అంచనా.