Share News

అమ్మకానికి జీవీకే పవర్‌ ఆస్తులు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:28 AM

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీవీకేపీఐఎల్‌)పై దివాలా ప్రక్రియ వేగం పుంజుకుంది. కంపెనీ నుంచి రావాల్సిన రూ.18,000 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు....

అమ్మకానికి జీవీకే పవర్‌ ఆస్తులు

  • ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ కోరిన సీఓసీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీవీకేపీఐఎల్‌)పై దివాలా ప్రక్రియ వేగం పుంజుకుంది. కంపెనీ నుంచి రావాల్సిన రూ.18,000 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని ఐదు బ్యాంకుల రుణదాతల కమిటీ (సీఓసీ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం కంపెనీ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్స్‌ను ఆహ్వానించాయి. సీఓసీ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. తమ బకాయిల వసూలు కోసం ఈ బ్యాంకు లు ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రుణాలు, హామీల రూపం లో జీవీకే పవర్‌.. బ్యాంకులకు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలు, హామీలను జీవీకే గ్రూప్‌ విదేశాల్లోని ఈ బ్యాంకుల శాఖల నుంచి తీసుకుంది. దీంతో ఈ బ్యాంకులకు తమపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే అఽధికారం లేదని జీవీకే పవర్‌ చేసిన వాదనను ఎన్‌సీఎల్‌టీ ఇప్పటికే తిరస్కరించింది.

Updated Date - Oct 23 , 2024 | 12:28 AM