అయోధ్యలో కరూర్ వైశ్యా బ్యాంక్
ABN , Publish Date - May 23 , 2024 | 06:05 AM
పాత ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) అయోధ్యలో కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసింది. బ్యాంకుకు ఇది 840వ బ్రాంచ్. బ్యాంక్ చైర్‌పర్సన్ డాక్టర్ మీనాహేమచంద్ర...
హైదరాబాద్: పాత ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) అయోధ్యలో కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసింది. బ్యాంకుకు ఇది 840వ బ్రాంచ్. బ్యాంక్ చైర్‌పర్సన్ డాక్టర్ మీనాహేమచంద్ర బుధవారం ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కేవీబీకి ఉత్తరప్రదేశ్‌లో ఇది ఏడవ బ్రాంచ్. ఈ బ్రాంచ్‌లో ఏటీఎం, నగదు డిపాజిట్ మెషిన్, పాస్‌బుక్ ప్రింటర్ వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కేవీబీ ఎండీ, సీఈఓ బీ రమేశ్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 100 కొత్త బ్రాంచిలు ప్రారంభించనున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.