Share News

ఏపీలో కేవీబీ రెండు కొత్త శాఖలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:38 AM

ప్రైవేటు రంగంలోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) గురువారం నాలుగు కొత్త శాఖలు ప్రారంభించింది.

ఏపీలో కేవీబీ రెండు కొత్త శాఖలు

చెన్నై: ప్రైవేటు రంగంలోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) గురువారం నాలుగు కొత్త శాఖలు ప్రారంభించింది. వీటిలో రెండు ఆంధ్రప్రదేశ్‌లోను, రెండు తమిళనాడులోను ప్రారంభమయ్యాయి. దీంతో బ్యాంకు శాఖల సంఖ్య 858కి చేరింది. విశాఖపట్టణంలోని మురళీనగర్‌ శాఖను సింహాచలం దేవస్థానం ఎవాల్యుయేషన్‌ అధికారి త్రినాథరావు ప్రారంభించారు. కడపలోని ఏడు రోడ్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బ్రాంచిని ఆర్‌డీఓ జాన్‌ ఇర్విన్‌ పాలపర్తి ప్రారంభించారు.

Updated Date - Nov 30 , 2024 | 05:38 AM