Share News

స్విస్‌ కంపెనీ చేతికి కోటక్‌ జనరల్‌

ABN , Publish Date - Jun 20 , 2024 | 01:25 AM

కోటక్‌ మహీంద్రా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో (కోటక్‌ జనరల్‌) మెజారిటీ వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని స్విట్జర్లాండ్‌కు చెందిన జూరిక్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ తెలిపింది. కోటక్‌ జనరల్‌లో...

స్విస్‌ కంపెనీ చేతికి కోటక్‌ జనరల్‌

  • 70 శాతం వాటా రూ.5,560 కోట్లకు కొనుగోలు

  • జూరిక్‌ కోటక్‌ ఇన్సూరెన్స్‌గా పేరు మార్పు

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో (కోటక్‌ జనరల్‌) మెజారిటీ వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని స్విట్జర్లాండ్‌కు చెందిన జూరిక్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ తెలిపింది. కోటక్‌ జనరల్‌లో 70 శాతం వాటాను రూ.5,560 కోట్లకు జూరిక్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి సంబంధిత నియంత్రణ మండలుల అనుమతులు లభించడంతో కోటక్‌ జనరల్‌ టేకోవర్‌ ప్రక్రియను జూరిక్‌ ఇన్సూరెన్స్‌ పూర్తి చేసిందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది.


కోటక్‌ బ్యాంక్‌ సాధారణ బీమా వ్యాపార విభాగమే కోటక్‌ జనరల్‌. వాటా కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో కంపెనీ పేరును జూరిక్‌ కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌గా మార్చారు. భారత సాధారణ బీమా రంగంలోకి ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎ్‌ఫడీఐ) ఇదే. అంతేకాదు, 2021లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాక వచ్చిన తొలి విదేశీ పెట్టుబడి కూడా ఇదే. కోటక్‌ జనరల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు జూరిక్‌ ఇన్సూరెన్స్‌ గత ఏడాది నవంబరులో ప్రకటించింది.

Updated Date - Jun 20 , 2024 | 01:25 AM