Share News

లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ఈ

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:58 AM

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ లంబోర్ఘిని భారత మార్కెట్లోకి ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ వెర్షన్‌ ఎస్‌యూవీ ఉరుస్‌ ఎస్‌ఈ విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). ప్రపంచ మార్కెట్లోకి మరికొన్ని హైబ్రిడ్‌ వాహనాలను

లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ఈ

ప్రారంభ ధర రూ.4.57 కోట్లు

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ లంబోర్ఘిని భారత మార్కెట్లోకి ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ వెర్షన్‌ ఎస్‌యూవీ ఉరుస్‌ ఎస్‌ఈ విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). ప్రపంచ మార్కెట్లోకి మరికొన్ని హైబ్రిడ్‌ వాహనాలను విడుదల చేయగానే వాటిని కూడా భారత్‌కు తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ట్విన్‌-టర్బో 4.0 వీ8 ఇంజన్‌తో కూడిన ఈ సరికొత్త ఉరుస్‌ ఎస్‌ఈ కారును విద్యుత్‌ మోటార్‌తో కూడా పనిచేసే విధంగా మార్పు లు చేసినట్లు కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్కో స్కార్డయోనీ చెప్పారు. 25.9 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో కూడిన ఈ ఎస్‌యూవీ.. ఎలక్ట్రిక్‌ మోడ్‌లో నడిస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

Updated Date - Aug 10 , 2024 | 05:58 AM