Share News

రూ.50,000 కోట్లు దాటిన మలబార్‌ గోల్డ్‌ టర్నోవర్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 02:39 AM

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.51,218 కోట్ల టర్నోవర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన జువెలరీ బ్రాండ్‌గా ఉన్న....

రూ.50,000 కోట్లు దాటిన మలబార్‌ గోల్డ్‌ టర్నోవర్‌

హైదరాబాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.51,218 కోట్ల టర్నోవర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన జువెలరీ బ్రాండ్‌గా ఉన్న మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ గడిచిన మూడు దశాబ్దాల్లో సాధించిన విజయానికి ఇది నిదర్శనమని పేర్కొంది. కాగా కేరళ ప్రధాన కేంద్రంగా ఉన్న మలబార్‌ గోల్డ్‌.. భారత్‌ సహా విదేశాల్లో కార్యకలాపాలను విస్తరించటం ద్వారా గ్లోబల్‌ లీడర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం 13కు పైగా దేశాల్లో 345 షోరూమ్స్‌ను నిర్వహిస్తున్న మలబార్‌ గోల్డ్‌.. త్వరలో న్యూజిలాండ్‌, ఈజిప్ట్‌, బంగ్లాదేశ్‌ సహా యూర్‌పలోని మరికొన్ని ప్రాంతాల్లో కొత్త షోరూమ్స్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో వచ్చే ఏడాది కాలంలో 100 కొత్త స్టోర్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా కొత్తగా 7,000 మంది ఉద్యోగులను చేర్చుకోవటం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్యను 28,000కు చేర్చాలని భావిస్తోంది. అలాగే భారత్‌లోని జార్ఖండ్‌, గోవా, అసోమ్‌, త్రిపుర, జమ్ము కశ్మీర్‌లకు కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మలబార్‌ గోల్డ్‌.. 8 దేశాల్లో 14 సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్స్‌తో పాటు ఐదు దేశాల్లో 15 జువెలరీ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్స్‌ను నిర్వహిస్తోంది. కాగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కింద మలబార్‌ గ్రూప్‌ ఇప్పటి వరకు రూ.234 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

Updated Date - Apr 13 , 2024 | 02:39 AM