మారుత్ డ్రోన్స్ రూ.52 కోట్ల సమీకరణ
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:13 AM
హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ సాంకేతిక స్టార్టప్ మారుత్ డ్రోన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా 62 లక్షల డాలర్ల (సుమారు రూ.52 కోట్లు) నిధులు సమీకరించింది. సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ సాంకేతిక స్టార్టప్ మారుత్ డ్రోన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా 62 లక్షల డాలర్ల (సుమారు రూ.52 కోట్లు) నిధులు సమీకరించింది. సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులను సేకరించినట్లు మారుత్ డ్రోన్స్ మంగళవారం వెల్లడించింది. వ్యాపార వృద్ధికి ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక వ్యవసాయ రంగ డ్రోన్ల అభివృద్ధితో పాటు భాగస్వామ్య నెట్‌వర్క్, సర్వీస్ సెంటర్లను ద్వితీయ, తృతీయ శ్రేణికి విస్తరించడం, డ్రోన్ అగ్రికల్చర్ సర్వీస్ హబ్‌ల ఏర్పాటు ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని కంపెనీ ప్రణాళికను రూపొందించుకుంది. తద్వారా వచ్చే ఐదేళ్లలో టర్నోవర్‌ను రూ.1,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.