మాసే ఫెర్గూసన్ బ్రాండ్‌పై ‘టఫే’కు ఊరట
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:28 AM
మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వినియోగంపై చెన్నై కేంద్రంగా పనిచేసే వ్యవసాయ పరికరాల సంస్థ టఫేకు, మద్రాస్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది.
న్యూఢిల్లీ: మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వినియోగంపై చెన్నై కేంద్రంగా పనిచేసే వ్యవసాయ పరికరాల సంస్థ టఫేకు, మద్రాస్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. ఈ బ్రాండ్ తమదేనని, ఈ విషయంలో అమెరికా కంపెనీ ఏజీసీఓ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మాసే ఫెర్గూసన్ కార్పొరేషన్‌కు ఎలాంటి హక్కులు లేవని ‘టఫే’ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కంపెనీకి అనుకూలంగా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ్రాండ్, ట్రేడ్‌మార్క్ టఫే ఇండియాకు ప్రత్యేకమని కంపెనీ తన పిటిషన్‌లో న్యాయస్థానానికి తెలిపింది.
హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్).. సెప్టెంబరు త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,327 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.1,729 కోట్లు)తో పోల్చితే లాభం 34.5 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.7,014 కోట్ల నుంచి రూ.8,522 కోట్లకు పెరిగింది.