Bank Holiday: వచ్చే మంగళవారం ఈ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్..కారణమిదే
ABN , Publish Date - May 05 , 2024 | 08:50 AM
18వ లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections 2024) దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇవి మొత్తం 7 దశల్లో జరుగుతుండగా, ఏప్రిల్ 19, 2024 నుంచి ప్రారంభమయ్యాయి. ఫలితాలు జూన్ 4, 2024న వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి కాగా, మూడో దశ ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది.
18వ లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections 2024) దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇవి మొత్తం 7 దశల్లో జరుగుతుండగా, ఏప్రిల్ 19, 2024 నుంచి ప్రారంభమయ్యాయి. ఫలితాలు జూన్ 4, 2024న వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి కాగా, మూడో దశ ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది. ఈ నేపథ్యంలో గత రెండు దశల ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేశారు. దీంతో మే 7న కూడా జరిగే మూడో దశ ఓటింగ్ సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు(bank holiday). అయితే ఏయే ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ప్రాంతాల్లో సెలవు
మూడో దశలో 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 94 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్(voting) జరుగుతుంది. వాటిలో బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఫేజ్ 3లో ఉన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ తేదీ కనెక్టివిటీ అడ్డంకుల కారణంగా రీషెడ్యూల్ చేయబడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్‌బీఐ ఇప్పటికే సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. వాటిలో అహ్మదాబాద్, భోపాల్, పనాజీ, రాయ్‌పూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బ్యాంకులను మూసి ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
మూడో దశలో ఎన్నికలు జరగనున్న ప్రాంతాలు
కోక్రాఝర్, ధుబ్రి, బార్పేట, గౌహతి, ఝంఝర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా, సుర్గుజా, రాయ్‌ఘర్, జంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్, ఉత్తర గోవా, దక్షిణ గోవా, కచ్, బనస్కాంత, పటాన్, మహాసనా గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, అహ్మదాబాద్ వెస్ట్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్ బందర్, జామ్‌నగర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, ఆనంద్, ఖేడా, పంచమహల్, దాహోద్, వడోదర, ఛోటా ఉదయపూర్, భరూచ్, బార్డోలీ, సూరత్, నవసారి, వల్సాద్, చిక్కోడి, బెల్గాం, బెల్గాం , బీజాపూర్, గుల్బర్గా,
రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా, మోరీనా, భింద్, గ్వాలియర్, గుణ, సాగర్, విదిషా, భోపాల్, రాజ్‌గఢ్, రాయ్‌గఢ్, బారామతి, సోమానాబాద్, లాతూర్, , మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కంగ్లే, సంభాల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బదౌన్, ఆమ్లా, బరేలీ, మాల్దా నార్త్, మాల్దా సౌత్, జంగీపూర్, ముర్షీద్ , డామన్ డయ్యూ, అనంతనాగ్-రాజౌరి ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News