ఐఐటీ భువనేశ్వర్‌తో ఎంఓసార్ట్ ల్యాబ్స్ జట్టు
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:06 AM
వీఎల్‌ఎ్‌సఐ ఎడ్యుటెక్ స్టార్టప్ ఎంఓసార్ట్ ల్యాబ్స్.. డిప్లొమా ప్రొగ్రామ్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
వీఎల్‌ఎ్‌సఐ ఎడ్యుటెక్ స్టార్టప్ ఎంఓసార్ట్ ల్యాబ్స్.. డిప్లొమా ప్రొగ్రామ్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా సెమీకండక్టర్, చిప్ డిజైన్‌లో ఇన్నోవేటివ్ ప్రొఫెషనల్ డిప్లొమా కార్యక్రమాన్ని ఎంఓసార్ట్ అందించనుంది. సెమీకండక్టర్ టెక్నాలజీ, అనలాగ్ డిజైన్, డిజిటల్ డిజైన్ వెరిఫికేషన్ వంటి వీఎల్‌ఎ్‌సఐ స్పెషలైజేషన్స్‌లో పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్ధులను తీర్చిదిద్దటం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపింది. ప్రధానంగా బీటెక్ ఈసీఈ, ఈఈఈ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సులను డిజైన్ చేసినట్లు తెలిపింది.
స్నాక్స్ తయారీలోని హల్దీరామ్ భుజియవాలా.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో స్వల్ప వాటాలు విక్రయించడం ద్వారా పాంతోమత్ భారత్ వాల్యూ ఫండ్ (బీవీఎఫ్) నుంచి రూ.235 కోట్లు సేకరించింది. తయారీ సామర్థ్యాలు, మార్కెట్ల విస్తరణకు ఈ నిధులు ఉపయోగించుకోనున్నట్టు తెలిపింది.