Share News

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు రూ.67.81 లక్షల కోట్లు

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:11 AM

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) విభాగంలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.52.44 లక్షల కోట్లుగా ఉన్న ఓపెన్‌ ఎంఎఫ్‌ పథకాల నిర్వహణలోని ఆస్తులు గత నెలాఖరు నాటికి...

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు రూ.67.81 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) విభాగంలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.52.44 లక్షల కోట్లుగా ఉన్న ఓపెన్‌ ఎంఎఫ్‌ పథకాల నిర్వహణలోని ఆస్తులు గత నెలాఖరు నాటికి 29 శాతం పెరిగి రూ.67.81 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఈక్విటీ పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.22.5 లక్షల కోట్ల నుంచి రూ.30.35 లక్షల కోట్లకు, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.1.94 లక్షల కోట్ల నుంచి 38 శాతం వృద్ధి రేటుతో రూ.2.68 లక్షల కోట్లకు చేరాయి. ఇండెక్స్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఈటీఎ్‌ఫల నిర్వహణలోని ఆస్తుల విలువ కూడా 28 శాతం వృద్ధితో రూ.8.83 లక్షల కోట్ల నుంచి రూ.11.29 లక్షల కోట్లకు చేరింది. హైబ్రిడ్‌, డెట్‌, లిక్విడ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ సైతం భారీగా పెరిగింది. అధిక రాబడులతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై కంటే ఈక్విటీ, మల్టీకాప్‌ ఫండ్స్‌పై ఆసక్తి చూపడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Updated Date - Dec 17 , 2024 | 01:11 AM