Share News

ఇండిగో బుకింగ్‌కు ‘ఎంఎక్స్‌’ ఆప్షన్‌

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:43 AM

విమానయాన సంస్థ ఇండిగో తన విమాన సర్వీసుల్లో ప్రయాణానికి టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వారికి లింగ తటస్థ ఆప్షన్‌ ‘‘ఎంఎక్స్‌’’ అందుబాటులోకి తెస్తోంది. దీని ప్రకారం ఇండిగోలో...

ఇండిగో బుకింగ్‌కు ‘ఎంఎక్స్‌’ ఆప్షన్‌

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో తన విమాన సర్వీసుల్లో ప్రయాణానికి టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వారికి లింగ తటస్థ ఆప్షన్‌ ‘‘ఎంఎక్స్‌’’ అందుబాటులోకి తెస్తోంది. దీని ప్రకారం ఇండిగోలో ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేసుకునే వారు బుకింగ్‌ సమయంలో మేల్‌, ఫిమేల్‌తో పాటు లింగ తటస్థ ఆప్షన్‌ ఎంఎక్స్‌ కూడా ఎంచుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్లుగా తమ గుర్తింపు వెల్లడించడానికి ఇష్టపడని వారు ఈ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, విస్తారా ఇప్పటికే బుకింగ్‌లకు ఎంఎక్స్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంచాయి. ఇదిలా ఉండగా తాము మరింత ఎక్కువ మంది దివ్యాంగులను రిక్రూట్‌ చేసుకోవాలనుకుంటున్నామని గ్రూప్‌ మానవ వనరుల విభాగం చీఫ్‌ సుఖ్‌జిత్‌ ఎస్‌ పశ్రిచా చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ ఉద్యోగుల సంఖ్య 36,860 కాగా వారిలో 5,038 మంది పైలట్లు, 9,363 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు.

కాగా కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో 60 పైగా నగరాల్లో 240 మంది వరకు దివ్యాంగులు కూడా పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగుల సంఖ్య మూడు రెట్లు పెంచాలనుకుంటున్నట్టు సుఖ్‌జిత్‌ చెప్పారు.

Updated Date - Aug 26 , 2024 | 04:43 AM