Share News

ఎంఎ్‌ఫలకు కొత్త రూల్స్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:27 AM

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) సంస్థల్లో పారదర్శకత పెంచేందుకూ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు జారీ చేసింది....

ఎంఎ్‌ఫలకు కొత్త రూల్స్‌

ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) సంస్థల్లో పారదర్శకత పెంచేందుకూ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఇక ఏ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) కీలక ఉద్యోగి, ట్రస్టీ లేదా వారి సమీప బంధువులైనా, ఆయా ఏఎంసీలు నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల యూనిట్లలో ఒక త్రైమాసికంలో రూ.15 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే, రెండు రోజుల్లోగా ఆ విషయాన్ని కంప్లయన్స్‌ అధికారికి తెలపాలి. అలాగే ఇలా కొనుగోలు చేసిన యూనిట్లను లాభాల కోసం నెల రోజుల్లోపు అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కూడా కంప్లయన్స్‌ అధికారికి తెలపాలి. కాగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ (ఏఈఎ్‌సఎల్‌)కు సెబీ నోటీసులు జారీ చేసింది. కొంత మంది ఇన్వెస్టర్లను తప్పుగా పబ్లిక్‌ షేర్‌హోల్డర్లుగా వర్గీకరించడపై సెబీ ఈ నోటీసులిచ్చింది.

Updated Date - Oct 23 , 2024 | 12:27 AM