డిసెంబరు నాటికి నిఫ్టీ@ 24,500
ABN , Publish Date - May 29 , 2024 | 05:18 AM
ఈ ఏడాది డిసెంబరు నాటికి నిఫ్టీ 24,500 స్థాయికి చేరుకోవచ్చని, 2025 డిసెంబరు కల్లా 26,500 మైలురాయిని దాటవచ్చని ఎమ్కే ఇన్వె్‌స్టమెంట్ మేనేజర్స్ అంచనా వేసింది..
వచ్చే ఏడాది చివరి నాటికి 26,500కు సూచీ
ఎమ్కే ఇన్వె్‌స్టమెంట్ మేనేజర్స్ అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబరు నాటికి నిఫ్టీ 24,500 స్థాయికి చేరుకోవచ్చని, 2025 డిసెంబరు కల్లా 26,500 మైలురాయిని దాటవచ్చని ఎమ్కే ఇన్వె్‌స్టమెంట్ మేనేజర్స్ అంచనా వేసింది. మంగళవారం సూచీ 22,888 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్‌లో 23,110 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసింది. వచ్చే నెల 4న వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే ప్రస్తుతం మార్కెట్లు దృష్టిసారించనున్నాయని ఎమ్కే ఇన్వె్‌స్టమెంట్ పేర్కొంది. ఒకవేళ అంచనాలకు తగ్గట్టుగా ఎన్‌డీఏ ప్రభుత్వమే 330 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తే గనుక ప్రస్తుత విధానాలు కొనసాగడంతో పాటు భూ సమీకరణ, కార్మిక, న్యాయ వ్యవస్థలో మోదీ సర్కారు భారీ సంస్కరణలు చేపట్టవచ్చని.. ఇది మార్కెట్లకు సానుకూలంగా పరిణమించనుందని సంస్థ భావిస్తోంది. దీర్ఘకాలికంగా చూస్తే, భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా, బ్రిటన్‌లో ఎన్నికలతో పాటు వడ్డీ రేట్లపై అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని తన నివేదికలో ప్రస్తావించింది.
ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మల్టీ క్యాప్ విధానాన్ని అవలంభించాలని, లార్జ్‌క్యా్‌ప-మిడ్‌క్యా ప్స్‌లో సమానంగా పెట్టుబడులు పెట్టడం మేలని ఎమ్కే ఇన్వె్‌స్టమెంట్ మేనేజర్స్ చీఫ్ ఇన్వె్‌స్టమెంట్ ఆఫీసర్ మనీ శ్ సొంతాలియా సూచించారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ (బీఎ్‌ఫఎ్‌సఐ), ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), ఇండస్ట్రియల్స్ కంపెనీలు మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత దిద్దుబాటుకు లోనైన ఫార్మా రంగం తిరిగి పుంజుకోవచ్చన్నారు. వినియోగం, తయారీ, హరిత ఇంధనం, డిజిటైజేషన్, కృత్రిమ మేధ (ఏఐ), పొదుపు సొమ్ము ఆర్థిక పథకాల్లోకి మళ్లింపు భవిష్యత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన పేర్కొన్నారు.
మూడో రోజూ నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. పవర్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెన్సెక్స్ మంగళవారం 220.05 పాయింట్లు క్షీణించి 75,170.45 వద్దకు జారుకుంది. నిఫ్టీ 44.30 పాయింట్లు కోల్పోయి 22,888.15 వద్ద క్లోజైంది. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సూచీల గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ రూ.29,100 కోట్ల సమీకరణ: అదానీ గ్రూప్‌నకు చెందిన రెండు కంపెనీలు మొత్తం 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,100 కోట్లు) నిధులను సమీకరించనున్నాయి. షేర్ల విక్రయం ద్వారా 200 కోట్ల డాలర్ల (రూ.16,600 కోట్లు) సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ మంగళవారం వెల్లడించింది.