Share News

Nifty : నిఫ్టీ కొత్త రికార్డు

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:32 AM

ఈక్విటీ మార్కెట్‌ ఐదు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. అమెరికాలో జీడీపీ గణాంకాలు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉండడంతో పాటు ఇన్వెస్టర్లు ‘‘తగ్గినప్పుడు కొను’’ అనే సూత్రాన్ని పాటించి విలువ ఆధారిత కొనుగోళ్లు జరపడం మార్కెట్‌కు ఊపిరులు పోసింది. ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో జరిగిన కొనుగోళ్లు

Nifty : నిఫ్టీ కొత్త రికార్డు

5 రోజుల నష్టాలకు తెర దించిన మార్కెట్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ ఐదు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. అమెరికాలో జీడీపీ గణాంకాలు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉండడంతో పాటు ఇన్వెస్టర్లు ‘‘తగ్గినప్పుడు కొను’’ అనే సూత్రాన్ని పాటించి విలువ ఆధారిత కొనుగోళ్లు జరపడం మార్కెట్‌కు ఊపిరులు పోసింది. ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో జరిగిన కొనుగోళ్లు మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. ఈక్విటీ సూచీలు 1.7 శాతం మేరకు లాభపడ్డాయి. నిఫ్టీ అయితే సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. 428.75 పాయింట్లు లాభపడి 24,834.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 1,292.92 పాయింట్లు లాభపడి 81,332.72 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,387.38 పాయింట్లు లాభపడి 81,427.18 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే ఈ రెండు స్థాయిలూ గతంలో సెన్సెక్స్‌ నమోదు చేసిన జీవితకాల గరిష్ఠ స్థాయిల కన్నా దిగువనే ఉన్నాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 728 పాయింట్లు, నిఫ్టీ 304 పాయింట్లు లాభపడ్డాయి. అయితే గత శుక్రవారం నుంచి ఐదు సెషన్లలో సెన్సెక్స్‌ 1,303.66 పాయింట్లు, నిఫ్టీ 394.75 పాయింట్ల మేరకు నష్టపోయాయి.

  1. శుక్రవారం నాటి ర్యాలీతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.7,10,235.45 కోట్ల మేరకు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 4,56,92,671.33 కోట్లకు (5.46 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.

  2. నెస్లె మినహా సెన్సెక్స్‌ షేర్లన్నీ లాభపడ్డాయి. 4.51 శాతంతో భారతి ఎయిర్‌టెల్‌ లాభపడిన షేర్లలో ఉంది.

  3. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 2.12 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 1 శాతం లాభపడ్డాయి. రంగాలవారీ సూచీలన్నీ కూడా లాభాలతో ముగిశాయి.

ఫారెక్స్‌ నిధుల సరికొత్త రికార్డు

విదేశీ మారక నిల్వలు జూలై 19వ తేదీతో ముగిసిన వారంలో సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఆ వారంలో నిల్వలు 400 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 67,085.7 కోట్ల డాలర్లకు చేరాయి. ఫారెక్స్‌లో ప్రధాన భాగం అయిన విదేశీ మారక ఆస్తులు 257.8 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 58,804.8 కోట్ల డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడింది. ఇదే వారం లో బంగారం నిల్వలు 132.9 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 5,999.2 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

Updated Date - Jul 27 , 2024 | 06:32 AM