Share News

ఈనెల 19 నుంచి ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ

ABN , Publish Date - Nov 14 , 2024 | 03:25 AM

ఎన్‌టీపీసీకి చెందిన పునరుత్పాదక ఇంధన విభాగం ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 19న ప్రారంభమై 22న ముగియనుంది. ఐపీఓ షేర్ల విక్రయ ధర శ్రేణిని కంపెనీ...

ఈనెల 19 నుంచి ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ

ఇష్యూ ధరల శ్రేణి రూ.102-108

ఎన్‌టీపీసీకి చెందిన పునరుత్పాదక ఇంధన విభాగం ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 19న ప్రారంభమై 22న ముగియనుంది. ఐపీఓ షేర్ల విక్రయ ధర శ్రేణిని కంపెనీ రూ.102-108గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించనుంది. ఆసక్తి గలవారు కనీ సం 138 షేర్ల బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిడ్‌ సైజును 138 షేర్ల చొప్పున పెంచుకోవచ్చు. ఇష్యూ సైజులో 75 శాతం షేర్లు సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థా గతేతర ఇన్వెస్టర్లకు, 10 శాతం రిటైల్‌ మదుపరుల కోసం కేటాయించింది. అర్హులైన ఉద్యోగుల కోసం సంస్థ రూ.200 కోట్ల షేర్లను కేటాయించింది.


వీరికి ఒక్కో షేరుకు రూ.5 డిస్కౌంట్‌ కల్పించింది. ఎన్‌టీపీసీ ప్రస్తుత షేర్‌ హోల్డర్లకు సైతం రూ.1,000 కోట్ల షేర్లను కేటాయించింది. ఈ ఏడాదిలో హ్యుండయ్‌ ఇండియా (రూ.27,870 కోట్లు), స్విగ్గీ (రూ.11,327 కోట్లు) తర్వాత మూడో అతిపెద్ద ఐపీఓ ఇదే.

Updated Date - Nov 14 , 2024 | 03:25 AM