ఓలా ఎలక్ట్రిక్ @: 4,000 స్టోర్లు
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:18 AM
దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను 4,000 స్టోర్లకు విస్తరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌తో పోల్చితే ఇది నాలుగింతలు ఎక్కువని పేర్కొంది. సర్వీస్ సదుపాయలతో...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను 4,000 స్టోర్లకు విస్తరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌తో పోల్చితే ఇది నాలుగింతలు ఎక్కువని పేర్కొంది. సర్వీస్ సదుపాయలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్తగా 3,200 కో-లొకేటెడ్ స్టోర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మెట్రో నగరాలతో పాటు ప్రధమ, ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు చిన్న పట్టణాలు, మండల స్థాయిల్లో ఈ స్టోర్లను నెలకొల్పినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. వాహన కొనుగోలు, సర్వీస్ సహా పలు అంశాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.