Share News

2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరం

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:49 AM

భారత్‌కు 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు (సీఎస్‌) అవసరమని ఐసీఎ్‌సఐ ప్రెసిడెంట్‌ బి.నరసింహన్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో 73,000 మంది కంపెనీ సెక్రటరీలుండగా...

2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరం

న్యూఢిల్లీ: భారత్‌కు 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు (సీఎస్‌) అవసరమని ఐసీఎ్‌సఐ ప్రెసిడెంట్‌ బి.నరసింహన్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో 73,000 మంది కంపెనీ సెక్రటరీలుండగా 12 వేల మంది మాత్రం ప్రాక్టీస్‌ చేస్తున్నారని ఆయన చెప్పారు. కంపెనీలు చట్టబద్ధమైన నిబంధనలన్నింటికీ కట్టుబడేలా చూడడంలో సీఎ్‌సల పాత్ర కీలకమని తెలిపారు. దేశం సాధిస్తున్న వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే రాబోయే కాలంలో సీఎ్‌సల పాత్ర మరింతగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము సగటున సంవత్సరానికి 2500 మందికి సభ్యత్వం అందిస్తున్నామని చెప్పారు.

Updated Date - Aug 19 , 2024 | 03:49 AM