మన విదేశీ అప్పులు రూ.55.38 లక్షల కోట్లు
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:40 AM
ఈ ఏడాది మార్చి నెలాఖరుకు నాటికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సహా భారత విదేశీ రుణ భారం 66,380 కోట్ల డాలర్లకు (సుమారు రూ.55.38 లక్షల కోట్లు) చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3,970 కోట్ల డాలర్లు (సుమారు రూ.3.31 లక్షల కోట్లు) ఎక్కువ...
ముంబై : ఈ ఏడాది మార్చి నెలాఖరుకు నాటికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సహా భారత విదేశీ రుణ భారం 66,380 కోట్ల డాలర్లకు (సుమారు రూ.55.38 లక్షల కోట్లు) చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3,970 కోట్ల డాలర్లు (సుమారు రూ.3.31 లక్షల కోట్లు) ఎక్కువ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేసింది. జీడీపీపరంగా చూస్తే ఇదే కాలంలో విదేశీ రుణ భారం 19 శాతం నుంచి 18.7 శాతానికి తగ్గింది. మొత్తం 18.7 శాతం విదేశీ రుణ భారంలో ప్రభుత్వ వాటా 4.2 శాతం మాత్రమే. మిగతాదంతా ప్రభుత్వేతర సంస్థలు చేసిన రుణాలు.