బ్యాంకుల రుణ పత్రాల బాట: ఇక్రా
ABN , Publish Date - Sep 29 , 2024 | 02:29 AM
బ్యాంకింగ్ రంగంలో నిధుల కొరత కొనసాగుతోంది. పరపతి డిమాండ్‌కు తగ్గట్టు డిపాజిట్లు పెరగడం లేదు. దీంతో బ్యాంకులు కూడా రుణ పత్రాల (బాండ్స్) బాట పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో నిధుల కొరత కొనసాగుతోంది. పరపతి డిమాండ్‌కు తగ్గట్టు డిపాజిట్లు పెరగడం లేదు. దీంతో బ్యాంకులు కూడా రుణ పత్రాల (బాండ్స్) బాట పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.3 లక్షల కోట్లు బాండ్స్ ద్వారా సేకరించే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ సంస్థ అంచనా. ఇందులో ఇప్పటికే రూ.76,700 కోట్ల సమీకరణ పూర్తయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 225 శాతం ఎక్కువ.