27 నుంచి హైదరాబాద్‌లో పౌలీ్ట్ర ఇండియా ఎక్స్‌పో
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:13 AM
హైదరాబాద్ మరోసారి పౌలీ్ట్ర ఇండియా ఎక్స్‌పోకు వేదికవుతోంది.
హైదరాబాద్ (ఆంఽధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ మరోసారి పౌలీ్ట్ర ఇండియా ఎక్స్‌పోకు వేదికవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌లో ‘పౌలీ్ట్ర ఇండియా ఎక్స్‌పో- 2024’ జరగనుంది. హైదరాబాద్‌లో ఈ ఎగ్జిబిషన్ జరగడం వరుసగా ఇది 16వసారి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో దేశ, విదేశాలకు చెందిన పౌలీ్ట్ర పరిశ్రమ కంపెనీలు 400కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నాయి. దీనికి తోడు 35కుపైగా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని, ఏటా ఈ ఎక్స్‌పోను నిర్వహించే ఇండియన్ పౌలీ్ట్ర ఎక్వి్‌పమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) జాతీయ అధ్యక్షుడు ఉదయ సింగ్ బయాస్ విలేకరులతో చెప్పారు. ఎక్స్‌పో ప్రారంభానికి ముందు రోజు 26న నాలెడ్జ్ డే పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా పౌలీ్ట్ర పరిశ్రమలోకి ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు పౌలీ్ట్ర ఇండియా ఎక్స్‌పో చక్కటి వేదిక అన్నారు. మన దేశ జనాభా ఎదుర్కొంటున్న పోషకాహరలేమి సమస్యను అధిగమించేందుకు చౌక గా లభించే కోడి గుడ్లు చక్కటి ప్రత్యామ్నాయమని విలేకరుల సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్వర హేచరీస్ ఉన్నతాధికారి కేజీ ఆనంద్ అన్నారు.