Share News

ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.2,000 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:22 AM

హైదరాబాద్‌కు చెందిన సోలార్‌ మాడ్యూళ్ల తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. తద్వారా రూ.2,000 కోట్ల వరకు...

ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.2,000 కోట్ల ఐపీఓ

హైదరాబాద్‌కు చెందిన సోలార్‌ మాడ్యూళ్ల తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. తద్వారా రూ.2,000 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. క్రిసిల్‌ రేటింగ్‌ రిపోర్టు ప్రకారం.. గత ఏడాది డిసెంబరు 31 నాటికి ప్రీమియర్‌ ఎనర్జీస్‌ తన నిర్వహణ సామర్థ్యాన్ని 2.7 గిగావాట్ల మాడ్యూళ్లు, 2 గిగావ్లా సోలార్‌ సెల్స్‌ స్థాయికి విస్తరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సామర్థ్యాన్ని 3 గిగావాట్ల సోలార్‌ సెల్స్‌, 3.7 గిగావాట్ల మాడ్యూళ్లకు పెంచుకోవాలనుకుంటోంది.

Updated Date - Mar 13 , 2024 | 05:22 AM