Share News

Bullion market : పసిడి కొత్త రికార్డు

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:15 AM

దేశీయంగా పసిడి ధర సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి ఎగబాకింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం మరో రూ.150 పెరిగి రూ.78,450కి చేరుకుంది.

Bullion market :  పసిడి కొత్త రికార్డు

  • ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.78,450

  • రూ.94,200కి చేరిన వెండి

దేశీయంగా పసిడి ధర సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి ఎగబాకింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం మరో రూ.150 పెరిగి రూ.78,450కి చేరుకుంది. పండగ సీజన్‌లో ఆభరణ వర్తకుల టోకు కొనుగోళ్లతో పాటు నగల రిటైల్‌ సేల్స్‌ సైతం పెరగడం ఇందుకు కారణమని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. వెండి రేటు కూడా కిలోకు రూ.1,035 పెరుగుదలతో రూ.94,200కు ఎగబాకింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 2,678.90 డాలర్లు, సిల్వర్‌ 32.37 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మున్ముందు బంగారం ధరలు మరింత ఎగబాకవచ్చని బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Oct 05 , 2024 | 03:15 AM