Share News

మళ్లీ ధరల మంట

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:12 AM

దేశంలో ఆహార వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా అక్టోబరు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.21 శాతానికి దూసుకుపోయింది. గత ఏడాది జూలై తర్వాత...

మళ్లీ ధరల మంట

అక్టోబరులో 6 శాతం దాటిన ద్రవ్యోల్బణం

14 నెలల గరిష్ఠ స్థాయి

న్యూఢిల్లీ: దేశంలో ఆహార వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా అక్టోబరు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.21 శాతానికి దూసుకుపోయింది. గత ఏడాది జూలై తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. ప్రధానంగా పళ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, ఆయిల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ధరలు కొండెక్కాయి. పప్పులు, అనుబంధ ఉత్పత్తులు, గుడ్లు, చక్కెర, కన్ఫెక్షనరీ విభాగాల్లో మాత్రం ధరలు గణనీయంగా తగ్గాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబరు నెలలో ఉమ్మడి ఆహార ధరల సూచీ (సీఎ్‌ఫపీఐ) 10.87 శాతానికి దూసుకుపోయింది. ఇది 15 నెలల గరిష్ఠ స్థాయి. సీఎ్‌ఫపీఐ సెప్టెంబరు నెలలో 9.24 శాతం ఉంది. దీంతో వచ్చే నెలలో నిర్వహించనున్న సమీక్షలో కూడా ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించే ఆస్కారం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 04:12 AM