Share News

ధరల సెగ తగ్గిందోచ్‌..

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:34 AM

దేశంలో ధరల మంట తగ్గి సగటు జీవికి ఉపశమనం కలుగుతోంది. జూలై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠ స్థాయి 3.54 శాతానికి దిగివచ్చింది. ప్రధానంగా ఆహార వస్తువుల...

ధరల సెగ తగ్గిందోచ్‌..

ఐదేళ్ల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం.. జూలైలో 3.54 శాతంగా నమోదు

న్యూఢిల్లీ: దేశంలో ధరల మంట తగ్గి సగటు జీవికి ఉపశమనం కలుగుతోంది. జూలై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠ స్థాయి 3.54 శాతానికి దిగివచ్చింది. ప్రధానంగా ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో పాటు బేస్‌ ఎఫెక్ట్‌ (గత ఏడాది ఇదే నెలలో ధరలు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతూ ఉండడం) ఇందుకు కారణమని విశ్లేషకులంటున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయంలో ఈ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కారణంగా అక్టోబరు ద్వైమాసిక సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా చర్యలుండవచ్చని నిపుణులంటున్నారు. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో 5.08ు ఉండగా గత ఏడాది జూలైలో 7.44 శాతంగా నమోదైంది. కాగా 2019 సెప్టెంబరులో నమోదైన 3.99% తర్వాత ఇది ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన కట్టడి పరిధిలో కనిష్ఠ స్థాయి 4% దిగువకు రావడం ఇదే ప్రథమం.

Updated Date - Aug 13 , 2024 | 04:34 AM