నాణ్యతతోనే ఉత్పత్తులకు మనుగడ
ABN , Publish Date - Sep 12 , 2024 | 02:54 AM
సరైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నపుడే ఏ ఉత్పత్తి అయినా మార్కెట్‌లో మనగలుగుతుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు అన్నారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సరైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నపుడే ఏ ఉత్పత్తి అయినా మార్కెట్‌లో మనగలుగుతుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు అన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూఐసీ), హైదరాబాద్ చాప్టర్ 38వ వార్షిక కన్వెన్షన్‌ను ప్రారంభిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ఉత్పత్తి దశ నుంచే సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు వీలుగా కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ చెప్పినట్టు కంపెనీలకు ‘వినియోగదారుడే రాజు’ అన్నారు. తాను కొనే ఉత్పత్తి సరైన నాణ్యతా ప్రమాణాలతో ఉన్నపుడే వినియోగదారుడు సంతృప్తి పడతాడనే విషయాన్ని కంపెనీలు గుర్తుంచుకోవాలన్నారు.