హైదరాబాద్‌లో ఉత్పత్తి యూనిట్
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:45 AM
దేశీయ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎక్సికామ్ హైదరాబాద్‌లో డీసీ ఫాస్ట్ చార్జర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల కొనుగోలు చేసిన అమెరికా డీసీ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సంస్థ ట్రైటియం...
ఎక్సికామ్
న్యూఢిల్లీ: దేశీయ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎక్సికామ్ హైదరాబాద్‌లో డీసీ ఫాస్ట్ చార్జర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల కొనుగోలు చేసిన అమెరికా డీసీ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సంస్థ ట్రైటియం రూపొందించిన టెక్నాలజీతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ఎక్సికామ్ ఎండీ అనంత్ నహతా చెప్పారు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ యూనిట్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. ఎక్సికామ్.. ట్రైటియం టెక్నాలజీని 3.7 కోట్ల డాలర్లకు (సుమారు రూ.310 కోట్లు) కొనుగోలు చేసింది.