Share News

Ratan Tata: టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం.. ముంబై హాస్పిటల్‌లో చికిత్స..

ABN , Publish Date - Oct 09 , 2024 | 09:20 PM

టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వార్తలు నిజమేనని తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ratan Tata: టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం.. ముంబై హాస్పిటల్‌లో చికిత్స..
Ratan Tata health in Critical condition

టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వార్తలు నిజమేనని తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై (Mumbai)లోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వైద్యుల పర్యవేక్షణలో రతన్ టాటా చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రతన్ టాటా అనారోగ్యానికి గురయ్యారని, ముంబైలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారని సోమవారమే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ``ఎక్స్`` ద్వారా రతన్ టాటా ఖండించారు (Ratan Tata health).


తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రతన్ టాటా ఓ ట్వీట్ చేశారు. తాను ఐసీయూలో అడ్మిట్ అయ్యాననే వార్తలు ఒట్టి పుకార్లేనని, వాటిల్లో ఎలాంటి వాస్తవమూ లేదని అన్నారు. వయసు సంబంధిత కారణాలతో రొటీన్‌ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నానన్నారు. అయితే రెండ్రోజుల వ్యవధిలోనే అయన ఆరోగ్యం విషమించిందంటూ మరోసారి జాతీయ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా రతన్ టాటా ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు వెలువరిస్తున్నాయి. రతన్ టాటా సారథ్య బాధ్యతలు స్వీకరించాక టాటా గ్రూప్ ఎన్నో రెట్లు ఎదిగింది.


టాటా సన్స్ ఛైర్మన్‌గా 1991లో రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన పదవీ కాలంలో టాటా గ్రూప్ విలువను భారీగా పెంచారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి .10వేలకోట్ల టర్నోవర్‌‌గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం, ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన దీర్ఘదృష్టి వల్లే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్ వంటి దిగ్గజ సంస్థలు ఎదిగాయి. రతన్ టాటా పదవీ విరమణ అనంతరం సైరస్ మిస్త్రీ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే మిస్త్రీ వ్యవహార శైలి కారణంగా 2016 అక్టోబర్‌లో ఆయణ్ని తొలగించారు. అనంతరం నటరాజన్ చంద్రశేఖర్‌ను మిస్త్రీ స్థానంలో నియమించారు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 09:20 PM