దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ వేటు
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:06 AM
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా పనిచేసే దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (డీసీయూబీ) లైసెన్సును భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం ప్రకటించింది...
రూ.5 లక్షల వరకు డిపాజిట్లు సేఫ్
ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా పనిచేసే దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (డీసీయూబీ) లైసెన్సును భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం ప్రకటించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించడం, తిరిగి గాడిలో పడే అవకాశం లేకపోవడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. అయితే బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్న ప్రతి ఒక్క డిపాజిట్ చెల్లింపునకు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) హామీ ఉంటుందని ప్రకటించింది. లిక్విడేటర్‌ను నియమించి బ్యాంక్ మూసివేతకూ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రిజిస్ట్రార్, కమిషనర్‌ను ఆర్‌బీఐ కోరింది. లైసెన్సు రద్దుతో దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిట్లు సేకరించడం గానీ, రుణాల మంజూరు గానీ చేయకూడదని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది.