Share News

RBI : మార్కెట్‌కు ఆర్‌బీఐ బూస్ట్‌

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:12 AM

వరుసగా మూడో రోజూ భారీగా లాభపడిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతం

RBI : మార్కెట్‌కు ఆర్‌బీఐ బూస్ట్‌

సరికొత్త ఉన్నత శిఖరాలకు సూచీలు

1,618 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

మళ్లీ 23,000 ఎగువ స్థాయికి నిఫ్టీ

3 రోజుల్లో రూ.28.65 లక్షల కోట్ల వృద్ధి

ముంబై: వరుసగా మూడో రోజూ భారీగా లాభపడిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచింది. దాంతో మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,720.8 పాయింట్లు (2.29ు) ఎగబాకి 76,795.31 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి 1,618.85 పాయింట్ల (2.16ు) లాభంతో 76,693.36 వద్ద స్థిరపడింది. కాగా, నిఫ్టీ కూడా 498.8 పాయింట్ల (2.18ు) వరకు పెరిగి 23,320.20 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆల్‌టైం ఇంట్రాడే రికార్డుకు సూచీ మరో 18.5 పాయింట్ల దూరంలో ఉంది. చివరికి సూచీ 468.75 పాయింట్ల (2.05ు) లాభంతో 23,290.15 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. ఐటీతో పాటు వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్‌, రియల్టీ, ఆటో షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడం ఇందుకు దోహదపడింది.

దీంతో షేర్‌హోల్డర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టె డ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మూడు రోజుల్లో రూ.28.65 లక్షల కోట్లు వృద్ధి చెంది రూ.423.49 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన 3 ట్రేడింగ్‌ సెషన్లలో నిఫ్టీ 6.42 శాతం పుంజుకుంది. 2021 ఫిబ్రవరి తర్వాత సూచీకిదే అతిపెద్ద మూడు రోజుల లాభం. కాగా, ఈ వారం మొత్తం లో సెన్సెక్స్‌ 2,732.05 పాయింట్లు (3.69ు), నిఫ్టీ 759.45 పాయింట్లు (3.37ు) బలపడ్డాయి.


రూ.6,000 కోట్లకు హెరిటేజ్‌ మార్కెట్‌ క్యాప్‌

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ షేరు గత ఐదు రోజులుగా పరుగు తీస్తోంది. షేరు ధర 5 రోజుల్లో 55 శాతం పెరిగింది. శుక్రవారం 10 శాతం వృద్ధితో సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి రూ.661.75 వద్దకు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6,140.78 కోట్లకు పెరిగింది. ఐదు రోజుల్లో మార్కెట్‌ క్యాప్‌ రూ.2,400 కోట్లకు పైగా పుంజుకుంది.

Updated Date - Jun 08 , 2024 | 06:12 AM