RBI : అర్బన్ సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు
ABN , Publish Date - Jul 27 , 2024 | 06:33 AM
అవసరమైన సమయంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణా చర్యలు తీసుకునేందుకు వీలుగా పట్టణ సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యలను (పీసీఏ) ప్రకటించింది. ప్రైమరీ (అర్బన్) సహకార బ్యాంకులపై
ముంబై: అవసరమైన సమయంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణా చర్యలు తీసుకునేందుకు వీలుగా పట్టణ సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యలను (పీసీఏ) ప్రకటించింది. ప్రైమరీ (అర్బన్) సహకార బ్యాంకులపై (యూసీబీ) ఈ చర్యలు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి. దీని వల్ల నియంత్రణాపరమైన జోక్యం అవసరం అనిపించిన సమయంలో ఆర్‌బీఐ రంగంలోకి దిగి వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తగు దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. బలహీనంగా ఉన్న, ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న యూసీబీల స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా ఆర్‌బీఐ గతంలో ప్రకటించిన సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (ఎస్‌ఏఎఫ్) స్థానంలో ఈ పీసీఏ అమల్లోకి వస్తుందని తెలిపింది.