రియల్టీ.. హైదరాబాద్లో కాస్ట్లీ!
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:03 AM
ఈ ఏడాది ప్రథమార్థానికి దేశంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ బుధవారం విడుదల చేసిన...
రెండో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్: నైట్ ఫ్రాంక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది ప్రథమార్థానికి దేశంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ బుధవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గృహ రుణ నెలవారీ కిస్తీ (ఈఎంఐ)- ఆదాయం నిష్పత్తి ఆధారంగా నైట్ ఫ్రాంక్ దేశంలోని 8 ప్రధాన నగరాల వివరాలతో ఈ జాబితాను రూపొందించింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో ఈ నిష్పత్తి 30 శాతంగా నమోదైంది. 2023, 2022లోనూ నిష్ప త్తి 30 శాతంగానే ఉంది. ముంబై 51 శాతం నిష్పత్తితో అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఇకపోతే, హైదరాబాద్లో గృహాల చదరపు అడుగు సగటు ధర 2010లో రూ.2,728 స్థాయిలో ఉండగా.. 2019 నాటికి రూ.4,500 స్థాయికి పెరిగిందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు పేర్కొంది. 2024 ప్రథమార్ధంలో రూ.5,681కి చేరుకుందని, 2019 నాటి స్థాయితో పోలిస్తే 26 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది.