వాయిస్, ఎస్‌ఎంఎస్‌లకే రీచార్జ్ వోచర్లు : ట్రాయ్
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:36 AM
టెలికాం ఆపరేటర్ల టారిఫ్ వోచర్ల నిబంధనలనూ టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ సవరించింది. కంపెనీలు ఇక డేటా అవసరం లేని చందాదారులకు వాయిస్, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక రీచార్జ్ వోచర్లు జారీ చేయాలని...
న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ల టారిఫ్ వోచర్ల నిబంధనలనూ టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ సవరించింది. కంపెనీలు ఇక డేటా అవసరం లేని చందాదారులకు వాయిస్, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక రీచార్జ్ వోచర్లు జారీ చేయాలని స్పష్టం చేసింది. స్పెషల్ రీచార్జ్ కూపన్ల గడువును కూడా ప్రస్తుత 90 రోజుల నుంచి 365 రోజుకు పెంచింది. ప్రతి టెలికాం ఆపరేటర్ 365 రోజుల చెల్లుబాటయ్యేలా వాయిస్, ఎస్‌ఎంఎస్‌ల కోసం తప్పనిసరిగా కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్ జారీ చేయాలని స్పష్టం చేసింది. డేటా అవసరం ఉన్నా లేకపోయినా కంపెనీలు వాయిస్, ఎస్‌ఎంఎస్‌లతో కలిపి తమకు అంటగడుతున్నాయని చందాదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.