Share News

యూఎస్‌ నుంచి రెడ్డీస్‌ ఔషధం రీకాల్‌

ABN , Publish Date - Nov 04 , 2024 | 05:49 AM

రక్తంలో అధిక కాల్షియం స్థాయిల అదు పు, హైపర్‌ పారాథైరాయిడిజమ్‌ చికిత్సలో ఉపయోగించే సినాకాల్సెట్‌ టాబ్లెట్లను అమెరికన్‌ మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేస్తున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌...

యూఎస్‌  నుంచి  రెడ్డీస్‌ ఔషధం రీకాల్‌

న్యూఢిల్లీ: రక్తంలో అధిక కాల్షియం స్థాయిల అదు పు, హైపర్‌ పారాథైరాయిడిజమ్‌ చికిత్సలో ఉపయోగించే సినాకాల్సెట్‌ టాబ్లెట్లను అమెరికన్‌ మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేస్తున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. తయారీలో లోపాలున్నాయంటూ అమెరికన్‌ ఎఫ్‌డీఏ నివేదికను ఆధారం చేసుకుని ఈ టాబ్లెట్లున్న 3,31,590 బాటిల్స్‌ను ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. రెడ్డీస్‌ లేబరేటరీస్‌ న్యూ జెర్సీ అనుబంధ విభాగం రీకాల్‌ చేస్తున్న వాటిలో 30 ఎంజి పరిమాణం గల 2,85,126 బాటిల్స్‌ ఉన్నాయి. మిగతా బాటిల్స్‌ 60 ఎంజి, 90 ఎంజి డోసేజిలలోనివని కంపెనీ పేర్కొంది.

Updated Date - Nov 04 , 2024 | 05:49 AM