ఆయిల్ కంపెనీలకు ఊరట
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:33 AM
చమురు కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ కంపెనీల అసాధారణ లాభాలపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది...
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు
న్యూఢిల్లీ: చమురు కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ కంపెనీల అసాధారణ లాభాలపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, దేశం నుంచి ఎగుమతి చేసే విమాన ఇంధనం (ఏటీఎఫ్), పెట్రోల్, డీజిల్‌పై గత 30 నెలలుగా ప్రభుత్వం స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) పేరుతో ఈ ట్యాక్స్ విధిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ, ప్రైవేట్ రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా లబ్ది పొందనున్నాయి. దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఆర్‌ఐసీ) పేరుతో విధిస్తున్న సెస్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.